ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రెసిడెంట్ ఇల్లందుల రమేష్ ఆధ్వర్యంలో 29వ రోజు నిరవధిక ధర్నా . ఉద్యోగుల హక్కుల సాధన కోసం మరో అడుగు
భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ కరీంనగర్ 10: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం NHM JAC ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 28వ రోజుకు చేరుకుంది.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిరంతరం కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగులు తమ హక్కులు, ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన వేతనాల కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము.
కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన NHM ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మన ప్రధాన డిమాండ్లు:
NHM ఉద్యోగులందరి సేవలను రెగ్యులరైజ్ చేయాలి.
ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలి.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
పెండింగ్ వేతనాలు, బకాయిలు చెల్లించాలి.
ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి.
8% లాయల్టీ బోనస్ చెల్లించాలి.
మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి.
ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి.
మన పోరాటం వెనుక ఉన్న ఆశయం ఒక్కటే!
ఎన్నో సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో అంకితభావంతో పనిచేస్తున్న NHM ఉద్యోగులకు న్యాయం జరగాలి. వారి కుటుంబాలకు భరోసా కలగాలి. ఉద్యోగుల జీవితాల్లో స్థిరత్వం రావాలి.
29రోజులుగా ఎండను, వానను లెక్కచేయకుండా ఐక్యంగా పోరాడుతున్న ప్రతి ఒక్క NHM ఉద్యోగికి ప్రత్యేక అభినందనలు.
మన రాష్ట్ర నాయకత్వం చేస్తున్న కృషికి, జిల్లా నాయకులు మరియు ఉద్యోగుల ఐక్యతకు మనస్ఫూర్తిగా అభినందనలు.ప్రభుత్వం వెంటనే స్పందించి NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం.

