Wednesday, November 11, 2026
HomeEditorialదండేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో అల్పాహార పథకం ప్రారంభం

దండేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో అల్పాహార పథకం ప్రారంభం

📰 Generate e-Paper Clip

విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి దోహదం – సర్పంచ్ గొలిపెల్లి సంపత్

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అల్పాహార పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గొలిపెల్లి సంపత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నతనం నుంచే పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత చూపించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి అల్పాహార పథకాల ద్వారా విద్యార్థుల్లో పాఠశాల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన ఈ అల్పాహార పథకం పాఠశాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ పథకం విజయవంతంగా కొనసాగేందుకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సందీప్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు గడ్డం రాజమౌళి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రమేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.