దండేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో అల్పాహార పథకం ప్రారంభం

విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి దోహదం – సర్పంచ్ గొలిపెల్లి సంపత్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అల్పాహార పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొలిపెల్లి సంపత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నతనం నుంచే పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఉదయం పాఠశాలకు...