పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం.గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా అధ్యక్షుడు
భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ, కరీంనగర్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మైనారిటీ విభాగం ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని అన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, దేశంలో విద్యా రంగ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి అనేక విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, సమానత్వ భావాలు, విద్యా ప్రాధాన్యతను తెలంగాణ రక్షణ సేన పార్టీ ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో పోరాటం చేస్తున్నారని తెలిపారు.
కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించే దిశగా కృషి చేస్తామని, విద్య ప్రతి ఒక్కరి హక్కుగా ఉండాలే తప్ప ఆర్థిక స్థోమతకు పరిమితమయ్యే పరిస్థితి ఉండకూడదని వారు అన్నారు.
మహనీయుల ఆశయాలను మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హఫీజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోబిన్, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కుతాడి శ్రీనివాస్, జిల్లా దళిత విభాగం అధ్యక్షుడు చంటి శ్రీనివాస్, యండి ఇర్ఫాన్, కైఫ్, జామల్, అసీఫ్ అలీ, నవాజ్, సయ్యద్ గౌస్, సయ్యద్ రేహాన్, పైజాల్ అలీ ఖాన్, యండి నవిద్, షెక్ సలీం, యండి సహిద్, యండి నవాబ్, యంఎ కైఫ్ తదితరులు పాల్గొన్నారు.

