భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తేదీ 11- 11- 2026 బుధవారం రోజున హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్య యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్ ) మండల విద్యాధికారి కే రాములు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్ నజ్ నీమ్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయు రాలు మాట్లాడుతూ విద్య నిజమైన బలమని, జ్ఞానార్జన ద్వారా దేశ పురోగతికి,సమాజాభివృద్ధికి కృషి చేయవచ్చని తెలిపారు. విద్యార్థులకు చదివే ముఖ్యమని ఈరోజు బాగా చదివిన విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటాడని, విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు తదుపరి ఉపాధ్యాయ బృందం విద్య యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ, మధురమ్మ ట్రస్ట్ వారు మండల స్థాయిలో మంచి కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు . అనంతరము ట్రస్టు నిర్వాహకులు మాట్లాడుతూ మధురమమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 2011 సంవత్సరం నుండి ప్రభుత్వ సెక్టార్ల లోని విద్యార్థులకు, సమాజంలోని పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ నాయకుల జయంతి, వర్ధంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు, ఆటల పోటీలు నిర్వహిస్తూ వారి ఆశయాలను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొనుటకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు అనంతరం మండల స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన మొదటి ఇద్దరు విద్యార్థులు ఎం రచన జిల్లా పరిషత్ హై స్కూల్ ఇల్లందకుంట, పి. నాగలక్ష్మి కేజీబీవీ, ఇల్లందకుంట లకు శంకర్ నారాయణ డిక్షనరీ మరియు షీల్డ్ లను కన్సోలేషన్ ప్రైజులుగా బి రక్షిత, ఎం అక్షయ్, ఎం సహస్ర, కె రితిక్, డి కావ్య శ్రీ, బి నితిన్, ఎం అక్షయ్, డి రితిక లు శంకర్ నారాయణ డిక్షనరీలు అందించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు ఎస్ అనసూ య, ప్రేమ్ రాజు,కె జయప్రకాష్ సిహెచ్ వేణు, కే సత్యం, జె.రాధికా రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

