Tuesday, November 10, 2026
HomeEditorialచర్లపల్లిలో బహుజన రాజ్యాధికార సభ  విజయవంతం.

చర్లపల్లిలో బహుజన రాజ్యాధికార సభ  విజయవంతం.

📰 Generate e-Paper Clip

చర్లపల్లి స్ఫూర్తితో రాష్ట్రమంతటా బహుజన రాజ్యాధికార సభలు నిర్వహిస్తాం పేదల సమస్యలకు రాజకీయ అధికార సాధనే అంతిమ పరిష్కారం – ఇబ్రాం శేఖర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ నారాయణపేట జిల్లా, నవంబర్ 09:బహుజనులకు రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార సభ – 1 విజయవంతమైంది. చర్లపల్లి గ్రామంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ఈ స్ఫూర్తితో రాష్ట్రమంతటా బహుజన రాజ్యాధికార సభలు నిర్వహిస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ ఇబ్రాం శేఖర్ గారు ప్రకటించారు.

09-11-2026 ఆదివారం సాయంత్రం నారాయణపేట జిల్లా అధ్యక్షులు బొదిగెల శ్రీనివాస్ గారి అధ్యక్షతన మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామంలో బీఎస్పీ జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం, ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామంలో బహుజన రాజ్యాధికార సభ – 1 నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ ఇబ్రాం శేఖర్ గారు (మాజీ డిప్యూటీ మేయర్, BMC), విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, 4వ చీఫ్ జోన్ ఇన్‌చార్జ్ గౌరవ శ్రీరామ్ కృష్ణ  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇబ్రాం శేఖర్ గారు మాట్లాడుతూ, తెలంగాణలో బహుజనుల కష్టాలు, సమస్యలు తొలగి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నిజమైన రాజకీయ అధికారం రావాలంటే బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవడమే మార్గమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, బహుజనుల రాజకీయ అధికార సాధన కోసం పనిచేస్తున్న బీఎస్పీ రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు.

ఉత్తర భారతదేశంలో మాన్యవర్ కాన్షీరాం గారు బహుజన రాజకీయ ఉద్యమం ద్వారా బహుజన నాయకత్వాన్ని బలోపేతం చేసి, బెహేన్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిగా నిలబెట్టారని గుర్తుచేశారు. రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని వివరించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, రెండు రిజర్వుడ్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో బహుజనులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కాన్షీరాం గారి పోరాటం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టాయిలెట్ సౌకర్యాలు కూడా సక్రమంగా లేని పరిస్థితులు ఉండటం బాధాకరమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలు ఎదుర్కొంటున్న టాయిలెట్స్ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు ఆధిపత్య రాజకీయ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బెహెన్ కుమారి మాయావతి గారు దేశంలోని పేద, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత కోసం పనిచేస్తున్న నాయకురాలని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా బహుజనులు తమ ఓటును ఏనుగు గుర్తుకు వేయాలనీ కోరారు.

పల్లెగడ్డ గ్రామంలో బీఎస్పీ జెండా దిమ్మె ఆవిష్కరణతో పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. చర్లపల్లి సభలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు బీఎస్పీలో చేరారు. గుడిపల్లి శ్రీకాంత్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ గారు, మహబూబ్‌నగర్ 4వ జోన్ ఇన్‌చార్జ్ అంతటి నాగన్న గారు, పార్లమెంట్ ఇన్‌చార్జ్ గుద్దేటి గంగాధర్ గారు, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్ గారు, వనపర్తి జిల్లా అధ్యక్షులు మిద్దె మహేష్ గారు, నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు జక్లేట్ చంద్రయ్య గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం రాజు గారు, జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్ గారు, అసెంబ్లీ అధ్యక్షులు దాసరి అశోక్, కొక్కు గౌతమ్ గార్లతో పాటు చర్లపల్లి గ్రామస్తులు మోహన్, కృష్ణయ్య మరియు బహుజన వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.