చర్లపల్లిలో బహుజన రాజ్యాధికార సభ విజయవంతం.
చర్లపల్లి స్ఫూర్తితో రాష్ట్రమంతటా బహుజన రాజ్యాధికార సభలు నిర్వహిస్తాం పేదల సమస్యలకు రాజకీయ అధికార సాధనే అంతిమ పరిష్కారం – ఇబ్రాం శేఖర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు. భీమ్ ఇండియా టుడే న్యూస్ నారాయణపేట జిల్లా, నవంబర్ 09:బహుజనులకు రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార సభ – 1 విజయవంతమైంది. చర్లపల్లి గ్రామంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ఈ స్ఫూర్తితో రాష్ట్రమంతటా బహుజన రాజ్యాధికార సభలు నిర్వహిస్తామని బీఎస్పీ తెలంగాణ...