Wednesday, November 11, 2026
HomeEditorialఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి నవంబర్ 10ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కార్యక్రమంలో భాగంగా జగన్నాధపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు గుండాల భాగ్యలక్ష్మి–మధు ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలను అందజేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాకాయలు కాల్చి దీపావళి సంబరాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి–మల్లయ్య, మాజీ ఉపసర్పంచులు ఆరెపల్లి సమ్మయ్య, ఆరెపల్లి రాములు, వార్డు సభ్యులు ఆరెపల్లి సమ్మయ్య, పెండ్యాల కుమారస్వామి, ఆరెపల్లి చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల శామ్యూల్, పంజాల చేటరి, పంజాల సమ్మయ్య (అడ్వకేట్), పంజాల స్వామి, పంజాల శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు పంజాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ యువజన నాయకుడు పెండ్యాల రాజేష్, పంజాల వెంకటేష్, గూటం శ్రీనివాస్ రెడ్డి, బొంత అనిల్, ఎస్.డి. ఫాజల్, ఆరెపల్లి రాజు, మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.