భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పర్యటనలో భాగంగా గత 25 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ తమదైన గుర్తింపు పొందిన ఆర్ఎంపీ వైద్యులను తెలంగాణ పద్మశాలి ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వైద్య చిన్ని శేఖర్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రజలకు సుదీర్ఘకాలంగా వైద్య సేవలు అందిస్తున్న చిలుకమారి శ్రీనివాస్, కందగట్ల శ్రీనివాస్, మంచికట్ల సదానందం, అడ్డగట్ల కృష్ణమూర్తి, చిలుకమారి సత్యరాజు గార్లకు శాలువాలు కప్పి, పద్మవైద్య మెమొంటోలతో సన్మానించారు.
ఈ సందర్భంగా వైద్య చిన్ని శేఖర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడంలో అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులను గుర్తించి గౌరవించడం ఎంతో సంతోషకరమని అన్నారు.
25 సంవత్సరాలుగా వైద్య సేవల ద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందిన వైద్యులను సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

