Friday, November 13, 2026
HomeEditorialఈవోను మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు

ఈవోను మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు

📰 Generate e-Paper Clip

వేములవాడ ఆలయ ఈవోను మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిని తెలంగాణ స్టేట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ కమిటీ (రిజిస్టర్ నెం. 1148/2023) రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ ఔట్‌సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆదేశాల మేరకు జిల్లా జేఏసీ ఉపాధ్యక్షులు దయ్యాల కొమరయ్య, బొప్ప శేఖర్, కూలేరు సాగర్, జిల్లా కార్యదర్శి క్యాతం నరేష్ తదితరులు ఈవో రమాదేవిని కలిసి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి తమ సంఘం తరఫున పరిచయం చేసుకోవడంతో పాటు ఉద్యోగుల ఐక్యతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.