ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ప్రజల జీవనాన్ని, వారి ఆకాంక్షలను, ఆవేదనలను తన అక్షరాల్లో ఆవిష్కరించిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై తన కలం ద్వారా నిరంతరం పోరాడుతూ, ప్రజల్లో చైతన్యాన్ని నింపిన సామాజిక ఉద్యమకారుడు.
తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి తన రచనల ద్వారా విశిష్టమైన గుర్తింపును తీసుకొచ్చారు. సామాన్య ప్రజల జీవితాలనే తన సాహిత్యానికి వస్తువుగా, వారి సమస్యలు, హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
కాళోజీ గారి సాహిత్యం.. అది ప్రజల గొంతుక, సామాజిక చైతన్యానికి ప్రతీక, ప్రశ్నించే తత్వానికి నిదర్శనం. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ప్రజాహిత దృక్పథం భావితరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి.

