Saturday, November 14, 2026
Homeతెలంగాణకులగణన చేస్తారో..లేదంటే గద్దె దిగుతారో కేంద్రమే తేల్చుకోవాలి

కులగణన చేస్తారో..లేదంటే గద్దె దిగుతారో కేంద్రమే తేల్చుకోవాలి

📰 Generate e-Paper Clip

బీసీలను మోసం చేస్తున్న అమిత్ షా రాజీనామా చేయాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చకపోతే బీజేపీని బీసీలే గోరి కడతారు

బీసీలను మోసం చేసిన కేంద్ర మంత్రులకు దేశంలో ఎక్కడ కూడా పర్యటించే అర్హత లేదు

బీసీ కులగణన చేస్తామని హామీనిచ్చి పచ్చి మోసం చేసిన బీజేపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో బీసీలే రాజకీయంగా ఆ పార్టీకి గోరి కట్టడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీజేపీపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని 80 కోట్ల మంది బీసీల ప్రగాఢ ఆకాంక్షయిన బీసీ కులాల లెక్కలు చేపట్టాలని బీసీ సమాజమంతా దశాబ్దాలుగా పోరాటాలు చేస్తుంటే..ఎన్నికలలో లబ్ధి పొందడానికి బీసీ కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి, తీరా జనగణన చేపడుతున్న ఈ సందర్భంలో ఓబీసీ కాలమ్ చేర్చకుండా బీసీలకు బీజేపీ ప్రభుత్వం తీవ్రని అన్యాయం చేస్తుందని మహేందర్ గౌడ్ ఆరోపించారు. బీసీ కులాల లెక్కలు లేకుంటే..బీసీలకు భవిష్యత్ లేదని, బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అస్తిత్వం కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న బీసీల ఓట్లతో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యునిగా గెలిచి..కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న జి కిషన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. బీసీలను మోసం చేసిన కేంద్ర మంత్రులకు దేశంలో ఎక్కడా కూడా పర్యటించే అర్హత లేదని, భవిష్యత్తులో బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తే పార్టీలకతీతంగా బీసీ సమాజమంతా ఏకమై అడ్డుకుంటుందని మహేందర్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. బీసీ కులగణన చేపట్టడం చేతకాకపోతే కేంద్ర హోం శాఖ పదవికి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు చారిత్రాత్మకంగా ఇంత అన్యాయం చేస్తున్న బీజేపీ అధిష్టానంపై బీజేపీలో చీము, నెత్తురు ఉన్న బీసీ నేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలపై తిరుగుబాటు చేయాలని మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చేంత వరకు, బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లను పెంచే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, డిసెంబర్ 14, 15 తేదీలలో వేలాది మందితో ఢిల్లీని ముట్టడించి..బీసీల తడాఖా ఎట్లుంటదో బీజేపీ ప్రభుత్వానికి రుచి చూపిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.