Friday, November 13, 2026
HomeEditorialఆత్మహత్యకు కారకుడైన గజ్జల హరికృష్ణ ను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలి.

ఆత్మహత్యకు కారకుడైన గజ్జల హరికృష్ణ ను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలి.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ న్యాయ శాస్త్ర విద్యార్థి, డాకూరి చంద్రకళ (23 సంవత్సరాలు,LLB రెండవ సంవత్సరం, SC డక్కలి) ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలి డాకూరి చంద్రకళ 23 సంవత్సరాలు శాతవాహన యూనివర్సిటీ న్యాయ విద్యార్థి ( LLB రెండో సంవత్సరం ) ఆత్మహత్యకు కారకుడైన గజ్జల హరికృష్ణ ను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలి.

ఆమె కుటుంబ సభ్యులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో వెంటనే ఇవ్వాలి

డాకూరు చంద్రకళ 23 సంవత్సరాలు ఎస్సీ,డక్కలి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. షాద్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పట్టణంలో డాకూరి చిన్నయ్య లక్ష్మమ్మలు కూలి పని చేసి జీవిస్తున్నారు. చిన్నయ్య కు అయిదుగురు ఆడ పిల్లలు ఇద్దరు మగ సంతానంలో ఈమె ఒకరు.. తమ సామాజిక వర్గంలో కష్టపడి కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో LLB రెండో సంవత్సరం చదువుతుంది.

నిన్న మధ్యాహ్నం యూనివర్సిటీ హాస్టల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు హాస్టల్ రూమ్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది యూనివర్సిటీ అధికారులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. షాద్నగర్ నుండి వచ్చిన చంద్రకళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల కథనం మేరకు చదువుల్లో చాలా తెలివైనది చురుకుగా ఉన్నది.. గత కొన్ని రోజులుగా పోటీ పరీక్షలు రాస్తున్నది.ఎస్సై కోసం కూడా ప్రిపేర్ అవుతున్నది. నిన్న మధ్యాహ్నం సెల్ ఫోన్ లో హరికృష్ణ తో మాట్లాడుకుంటూ ఉరి వేసుకున్నట్టుగా ఉంది. 

గజ్జల హరికృష్ణ,బిటెక్, శ్రీరాంపూర్, మంచిర్యాల జిల్లా చెందిన వాడు పోటీ పరీక్షల సందర్బంగా పరిచయంతో చంద్రకళను మోసం చేయడం వలన ఉరివేసుకొని చనిపోయినట్లుగా తెలుస్తుంది. 

ఎస్సీ, డెక్కలి కులానికి చెందిన అమ్మాయి ఎంతో ధైర్యవంతురాలు.సెలవుల్లో, కరోనా కాలంలో తన చుట్టుపక్కల ఉన్న పిల్లలకు చదువులు, కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్పించేది. చైతన్య మహిళా సంఘం లో మహిళా సమస్యలు, ఇతర సామాజిక బాధ్యతలు నెరవేర్చేది.

కానీ హరికృష్ణతో ఫోన్లో మాట్లాడుతూ ఉరివేసుకోవడం వెనుక గత కొద్ది కాలంగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తు వ్యసనాలకు అలవాటు పడుతున్న యువత వేదింపుల వల్ల విద్యార్థులు, యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

సెప్టెంబర్,12, 2026 గోదావరి ఖని లో SC మాదిగ సామాజిక వర్గానికి ఉస్మానియా యూనివర్సిటీ బీటెక్ చదువుతున్న తాండ్ర అక్షిత రాణి అనే అమ్మాయిని శ్రీరాంపూర్ పాలిటెక్నీక్ కాలేజీ అధ్యాపకుడు జెట్టి నవీన్ వేధింపులకు గురిచేసి గడ్డి మందు తాగించి హత్య చేసాడు. ఇట్లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఆత్మ హత్య ఘటన జరిగిందని పౌర హక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు భావిస్తున్నాయి 

కాలేజీలో, యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సెంటర్లు, భరోసా క్యాంపులు, షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తే ఈ ఆత్మహత్యల పరంపరలు ఆగిపోతాయి. వేధింపులను సకాలంలో అరికట్టడానికి పోలీసులు, యూనివర్సిటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నోసార్లు డిమాండ్ చేసిన కార్యాచరణలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వల్లే చంద్రకళా లాంటి విద్యార్థులు ఆత్మహత్యలకు గురవుతున్నారు.

చంద్రకళ ఆత్మహత్యకు కారకుడైన హరికృష్ణపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపించి శిక్షించాలి.*

చంద్రకళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,

50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రభుత్వం ఇవ్వాలి.

శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్(VC) ,రిజిస్టార్ లపై ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలి.

తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కాలేజీల్లో యూనివర్సిటీల్లో, పాలిటెక్నిక్ లాంటి విద్యాలయాల్లో విద్యార్థినిలపై, యువతులపై వేధింపులు జరగకుండా కౌన్సిలింగ్ టీమ్ లు, షీ టీంలు సమర్థవంతంగా పనిచేయాలి.

వేధింపుల నివారణ కోసం పౌర సమాజం, మేధావులతో కూడిన ప్రజాసంఘాలు,పోలీసులు,యూనివర్సిటీ అధ్యాపకులతో ఒక కమిటీ వేయాలి… తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొల్లూరి ప్రవీణ్ కుమార్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.