భీమ్ ఇండియా టుడే న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మరియు మాచారెడ్డి మండల కేంద్రంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని అదేవిధంగా రైతుల పంటలు నీరు లేక ఎండిపోయిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ గారు డిమాండ్ చేశారు. ఈరోజు మాచారెడ్డి పాల్వంచ మండల కేంద్రంలో రైతుల పండించిన వారిని నీరు లేక ఎండిపోయిన పంటలను మరియు రైతులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఎండిపోయిన పంటలకు ఎకరానికి 30 వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వమే కాకుండా మధ్య రైతుల అప్పులను ఆసరాగా చేసుకుని మధ్య దళారులు పంటల వద్దకు రావడం జరుగుతుందని ఆమె అన్నారు ఇప్పటికైనా మండల జిల్లా అధికార యంత్రాంగం అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని నీళ్లు లేక పంటలు కూరగాయలు వరి ఇతర పంటలు ఎండిపోయి రైతులు డ్రాకువ గ్రూప్ ద్వారా అప్పులు తీసుకొచ్చి పంటలకు ఎరువులకు పెట్టుబడి పెట్టడం జరిగిందని అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో కరువు కాటకంలో ఉన్నామని రైతులు ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కనీస ధరలు ఇవ్వాలని అదేవిధంగా మరోసారి వరి వేయొద్దు చెపుతుంటూ పద్య దళారులు వరి కొనుగోలు చేసి బ్లాక్ నీలవా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రైతులపై వ్యాపారం చేస్తున్న మధ్య దళారులపై ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని లేని యెడల ఈనెల 11వ తేదీన కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల తో ధర్నా నిర్వహించి నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు దృష్టిలో ఉంచుకొని పేద మధ్యతరగతి ప్రజల రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె అన్నారు స్వామినాథ కమిటీ ప్రకారం పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ గారు సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ జిల్లా నాయకులు ఎం దేవయ్య రాజ్యం సత్యం సుమన్ ఎల్లవ్వ రమేష్ కృష్ణమూర్తి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయాలని కరువుకాటకాలనుండి రైతులను ఆదుకోవాలని ప్రతి రైతుకు నష్టపోయిన రైతుకు ఎకరానికి 30 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం ద్వారా బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు

