Saturday, November 14, 2026
Homeతెలంగాణపాడి కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో..

పాడి కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో..

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ కమలాపూర్ మండలంలో ఐకెపి సెంటర్ల ప్రారంభోత్సవానికి అడ్డుపడుతున్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి వైఖరిపై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలాపూర్లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్ బాబు గారు నిరంతరం శ్రమిస్తుంటే, రైతు వరిని కోసి, విక్రయించడానికి నడిరోడ్డుపై ధాన్యాన్ని పోసి ఎదురుచూస్తున్న క్రమంలో, ఐకెపి మరియు పాక్స్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సహకరించవలసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, సమయం ఇవ్వకుండా, ప్రారంభానికి అడ్డు తగిలి, అధికారులను బెదిరిస్తూ, ధాన్యం కొనుగోలును ఆపివేసి, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తినారు. తుఫాను ప్రభావంతో దాన్యం ఆగమైపోతుందనే ఆవేదనతో రైతులు తలడిల్లుతున్న విషయాన్ని కూడా గ్రహించని ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా బాధాకరమని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ పుల్ల శ్రీనివాస్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మౌటం కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, పోడేటి బిక్షపతి, ఆడెపు విజయ,చెర్రిపల్లి రామచంద్రం, పుల్ల శోభన్, చందుపట్ల నరసింహారెడ్డి, పల్లె సమ్మిరెడ్డి, పెరుమాండ్ల పరుశరాములు మాట్ల కళ్యాణ్ చేరాల రోహిత్, గంధసిరి అనిల్, అశోక్ చిలువేరు రవీందర్ ఎల్కటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.