Saturday, November 14, 2026
Homeతెలంగాణబీజేపీలోకి పలువురి చేరిక – నూతన బూత్ కమిటీలు

బీజేపీలోకి పలువురి చేరిక – నూతన బూత్ కమిటీలు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్: ఎల్కతుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా కేశవపూర్, ఇంద్రనగర్, దండేపల్లి, ఎల్కతుర్తి గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలు మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.* ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పలు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు, ఎల్కతుర్తి గ్రామంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

ఎల్కతుర్తి గ్రామంలో నూతన బూత్ కమిటీల ఏర్పాటు  పలువురి చేరిక

ఎల్కతుర్తి గ్రామంలో నూతనంగా బూత్ కమిటీలను ఏర్పాటు చేసి, మూడు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

314వ బూత్ అధ్యక్షుడిగా గోడిశాల రాజు

315వ బూత్ అధ్యక్షుడిగా అల్లి కిరణ్

316వ బూత్ అధ్యక్షుడిగా గూడెల్లి దశరథం

అదేవిధంగా *అల్లి సురేష్, అల్లి కిరణ్, దశరథం, దూడ రమేష్, కందుకూరి శ్రీనివాస్, కడారి లింగయ్య* తదితరులు భారతీయ జనతా పార్టీలో చేరారు.

వీరికి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్, చిదురల వెంకటేష్, సీనియర్ నాయకులు జనగాని కిష్టయ్య, నాంపల్లి అశోక్, పెరుగు మధు, కొమ్మిడి విజయేందర్ రెడ్డి, నమిండ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి గ్రామంలో బూత్ కమిటీల ఏర్పాటు

దండేపల్లి గ్రామంలోని నాలుగు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

289వ బూత్ అధ్యక్షుడిగా మాచర్ల వెంకటేష్

290వ బూత్ అధ్యక్షుడిగా పనుగంటి లక్ష్మారెడ్డి

291వ బూత్ అధ్యక్షుడిగా కడారి సంపత్ రావు

292వ బూత్ అధ్యక్షుడిగా కాటుకూరి కార్తీక్

ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్‌చార్జ్ మాచర్ల తిరుపతి, మండల కార్యదర్శి చీర్ర శ్రీనివాస్, నరేడ్ల శంకర్, మాచర్ల శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రనగర్ గ్రామంలో తొలిసారిగా బీజేపీ బూత్ కమిటీ

ఇంద్రనగర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీని ఏర్పాటు చేశారు. 319వ బూత్ అధ్యక్షుడిగా నమిండ్ల ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కడారి ప్రసాద్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

కేశవపూర్ గ్రామంలో బూత్ అధ్యక్షుల ఎన్నిక

కేశవపూర్ గ్రామంలో మూడు బూత్‌లకు అధ్యక్షులను ఎన్నుకున్నారు.

320వ బూత్ అధ్యక్షుడిగా ఈర కుమారస్వామి

321వ బూత్ అధ్యక్షుడిగా పుట్ట కనకయ్య

322వ బూత్ అధ్యక్షుడిగా గన్నోజు రాకేష్

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పోలు నరేష్, మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎర్రగొల్ల శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ పోలు శివసేన, జెల్ల రాజు, పోలు రాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి బూత్‌ను పార్టీకి బలమైన పునాదిగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన బూత్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో బూత్ కమిటీలు కీలకమని, ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకితభావంతో, సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి బూత్‌ను పటిష్టమైన శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యకర్తల భాగస్వామ్యంతో పార్టీ సంస్థాగత కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.