Saturday, November 14, 2026
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలను వెంటనే సవరించాలి

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలను వెంటనే సవరించాలి

📰 Generate e-Paper Clip

లేనిపక్షంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని ముట్టడిస్తాం నాలుగుసార్లు సర్వేలు చేసి కమిటీల జాబితానే ఫైనల్ చేస్తారా?

భీమ్ ఇండియా టుడే న్యూస్ సైదాపూర్ అధికారులను గ్రామాల్లోకి రానివ్వబోమని రాయికల్ పీఏసీఎస్ డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి హెచ్చరిక

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జరిగిన అవకతవకలను అధికారులు వెంటనే సవరించాలని, లేనిపక్షంలో మంగళవారం జరిగే మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజలతో కలిసి ముట్టడిస్తామని రాయికల్ పీఏసీఎస్ డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో మండల ప్రజలకు సమాధానం చెప్పాలని, ఎంపిక ప్రక్రియను తక్షణమే పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సుమారు మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒకే విడత ఇళ్లను మంజూరు చేశారని, ప్రస్తుతం రెండో విడత ఎంపికలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో అధికారులు నాలుగుసార్లు గ్రామాల్లో సర్వేలు నిర్వహించి ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరిట జాబితాలు రూపొందించారని గుర్తుచేశారు. లబ్ధిదారులను పిలిచి ఫోటోలు తీస్తూ ప్రజల సమయాన్ని, ప్రభుత్వ సమయాన్ని వృథా చేసిన అధికారులు.. చివరకు మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఎలాంటి చట్టబద్ధత లేని ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితానే తుది జాబితాగా ప్రకటించడం దురదృష్టకరమన్నారు. కమిటీలు పంపిన జాబితానే ఫైనల్ చేసేటప్పుడు ఈ సర్వేలన్నీ ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు.ఇందిరమ్మ కమిటీలకు ఉన్న చట్టపరమైన హక్కులు, విధివిధానాలు ఏమిటో అధికారులు స్పష్టం చేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కమిటీలకు కేవలం లబ్ధిదారులను సూచించే అవకాశం మాత్రమే ఉంటుందని, ఎంపిక చేసే హక్కు ఉండదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులే కమిటీ సభ్యులతో కలిసి అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గెజిటెడ్ అధికారులమంటూ ముందస్తుగా తయారు చేసిన జాబితాలతో గ్రామాల్లోకి సర్వేకు వస్తే ఊరుకునే పరిస్థితి లేదని, నిరాశతో వెనుతిరగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. దొంగచాటుగా సర్వేలు నిర్వహిస్తే సంబంధిత అధికారుల వివరాలు తెలుసుకుని కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతామన్నారు. సమస్య పెద్దది కాకముందే అధికారులు స్పందించి, పథకం మార్గదర్శకాల ప్రకారం గ్రామంలోని అన్ని కుటుంబాలను పారదర్శకంగా సర్వే చేసి అసలైన లబ్ధిదారులను మాత్రమే తుది జాబితాలో చేర్చాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.