Friday, November 13, 2026
Homeతెలంగాణపేదలకు కేటాయించిన భూముల్లో ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దు

పేదలకు కేటాయించిన భూముల్లో ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దు

📰 Generate e-Paper Clip

పేదల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి: మారుపాక అనిల్

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం  హుజూరాబాద్: పేదల జీవనాధారమైన భూములను కంపెనీలకు కేటాయించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మారుపాక అనిల్ డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ పరిధిలో పేదలకు కేటాయించిన భూముల్లో ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మారుపాక అనిల్ మాట్లాడుతూ.. గత ఎన్నో సంవత్సరాలుగా పేద కుటుంబాలు ఈ భూములపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. అటువంటి భూములను కంపెనీలకు కేటాయిస్తే నిరుపేద కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో పేదల హక్కులను, వారి జీవనోపాధిని దెబ్బతీయడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, అధికారులు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని, భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

పేదల భూములను పరిరక్షించే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని మారుపాక అనిల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.