Saturday, November 14, 2026
Homeతెలంగాణఅర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషీధర్ రెడ్డి గారు కలిసి శ్రీనివాస హాస్పిటల్, కిరణ్ హాస్పిటల్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు.

అదేవిధంగా లాయర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులను కలిసి నవంబర్ 4న నిర్వహించనున్న ఎస్‌ఐఆర్‌ మేధావుల సదస్సుకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరుకల గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్, ఉపాధ్యక్షురాలు సత్యవతి, అర్బన్ అధ్యక్షులు సంపత్, నాయకులు బట్టు రవి, మైనం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.