Saturday, November 14, 2026
Homeతెలంగాణచాకచక్యంగా పట్టుకున్న ఎల్కతుర్తి పోలీసులు

చాకచక్యంగా పట్టుకున్న ఎల్కతుర్తి పోలీసులు

📰 Generate e-Paper Clip

గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం హన్మకొండ జిల్లా లో 20 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు  స్వాధీనంహన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామ శివారులో కాకతీయ వెంచర్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు

పోలీసులను చూసిన ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే పట్టుకొని విచారించారు. విచారణలో వారు దామెర గ్రామానికి చెందిన రొడ్డా బోయిన శ్రీదర్, దామెర గ్రామానికి చెందిన మట్టెడ జశ్వంత్, దామెర గ్రామానికి చెందిన ఉప్పాల గణేష్‌గా గుర్తించారు.

వీరు గత రెండు సంవత్సరాలుగా గంజాయి సేవించడానికి అలవాటు పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో శ్రీదర్ అనే వ్యక్తి హుజురాబాద్ కు. వెళ్లి అక్కడ ఆకాష్ అనే వ్యక్తి వద్ద 30 గ్రాముల గంజాయిని రూ.1,500కు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అదే రోజు రాత్రి శ్రీదర్, మట్టెడ జశ్వంత్ కొంత గంజాయిని సేవించారు.

శుక్రవారం మధ్యాహ్నం శ్రీదర్, మట్టెడ జశ్వంత్, గణేష్ ముగ్గురూ కాకతీయ వెంచర్ వైపు వెళ్లి గంజాయి సేవించిన అనంతరం మిగిలిన గంజాయిని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి కొనుగోలు, విక్రయాలు, వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో ఎల్కతుర్తి ఎస్ఐ నరసింహారావు, కానిస్టేబుల్ బక్కన్న మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.