Saturday, November 14, 2026
Homeతెలంగాణగత నెలలో జరిగిన గణపతి నిమజ్జనం తరువాత

గత నెలలో జరిగిన గణపతి నిమజ్జనం తరువాత

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి కాసర్ల గోదావరి స్వామి గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగ్వన్ గారిని కలిసి తర్వాత స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ YN గిరి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది

గత నెలలో జరిగిన గణపతి నిమజ్జనం, మరియు దుర్గా మాత నిమజ్జన కార్యక్రమాల తరువాత ఏర్పడిన SCRAP, విగ్రహాలకు సంబందించిన స్టాండ్ లు మరియు ఇతరత్రా సామానును కౌన్సిల్ కు తెలుపకుండా అక్రమంగా విక్రయించినారు.

కామారెడ్డి పట్టణము, అశోక్ నగర్ కాలనీ లో గల మునిసిపల్ ఓపెన్ స్థలము సర్వే నెం.218, 219, L.P.No.135/1985 లో గల విస్తీర్ణము ఎ.1-07 (ఒక ఎకరము ఏడు గుంటలు) లు గల మున్సిపల్ స్థలంలో అక్రమంగా కబ్జా చేసి కొత్తగా ఒక నిర్మాణము చేయుచున్నారు, మరియు ఇదే స్థలంలో గతంలో రెండు నిర్మాణాలు చేసినారు, దీనికి అధికార కాంగ్రెస్ పార్టీ యనకులు సహకరిస్తున్నారు. కావున ఇట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి విలువైన మునిసిపల్ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా చర్యలుతీసుకోగలరు.

కామారెడ్డి మునిసిపల్ వార్డ్ లలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించకుండా, పండుగలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా, మునిసిపల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

కమీషనర్ చాంబర్ లో గల సి.సి. కెమరాలలో గల వాయిస్ రికార్డు సౌకర్యాన్ని ఉపయోగించుకొని, చాంబర్ లో కౌన్సిలర్ లు మరియు ఇతరులు మాట్లాడిన విషయాలకు సంబంధించి కౌన్సిలర్ లను బెదిరిస్తున్నారు. మరియు సిసి కెమెరాలకు సంబంధించిన యాక్సెస్ మున్సిపల్ చైర్ పర్సన్ గారి భర్త అయినటువంటి శ్రీనివాస్ దగ్గర ఉన్నటువంటి ప్రూప్స్ ను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గతంలో అతను కౌన్సిలర్ కు పంపించినటువంటి సందేశాలు మరియు ప్రూఫ్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది

కావున తమరు ఇట్టి విషయమై తక్షణమే మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశము ఏర్పాటు చేయగలరు అని కోరుచున్నాము.

ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి కాసర్ల గోదావరి స్వామి మరియు కౌన్సిలర్ లు కోఆప్షన్ మెంబర్ పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.