Wednesday, November 11, 2026
HomeEditorialదళితుల అసైన్డ్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాలి

దళితుల అసైన్డ్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాలి

📰 Generate e-Paper Clip

దళితుల భూముల స్వాధీనాన్ని తక్షణమే నిలిపివేయాలి

మారుపాక అనిల్ కుమార్, డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం హనుమకొండ: దళిత పేదలకు ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలని, అభివృద్ధి, పరిశ్రమల పేరుతో దళితుల సాగు భూములను స్వాధీనం చేసుకునే చర్యలను తక్షణమే నిలిపివేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
దళిత హక్కుల పోరాట సమితి హనుమకొండ జిల్లా సమితి సమావేశం రాజారపు రత్నం అధ్యక్షతన సమావేశం రోజున బుధవారం స్థానిక బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ, దళిత పేదలకు భూమిని పంపిణీ చేయడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పునాది వేయాల్సిన ప్రభుత్వం, మరోవైపు వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో అదే భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడం ఆందోళనకరమన్నారు. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, దళిత పేదల జీవనాధారమని, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.దశాబ్దాలుగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించకుండా అనేక ఆంక్షలతో ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమన్నారు. అసైన్డ్ భూములపై సాగుదారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కోరారు.
ప్రభుత్వ భూముల పంపిణీ, అసైన్డ్ భూముల వివరాలు, ప్రస్తుతం సాగులో ఉన్న రైతుల స్థితిగతులపై జిల్లా వారీగా సమగ్ర సర్వే నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు మళ్లించే ముందు బాధిత రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, చట్టబద్ధమైన పరిహారం, పునరావాసం కల్పించకుండా భూములను స్వాధీనం చేసుకోరాదని స్పష్టం చేశారు.దళితుల భూముల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతుందని, జిల్లా, మండల, గ్రామస్థాయిలో భూ సమస్యలపై పోరాటాలను బలోపేతం చేస్తామని తెలిపారు.దళితుల భూముల పరిరక్షణ, అసైన్డ్ భూములకు సంపూర్ణ హక్కుల సాధన కోసం ప్రజాస్వామిక శక్తులు, దళిత సంఘాలు, భూమిలేని పేదలు ఐక్యంగా ఉద్యమించాలని మారుపాక అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బి కె యం యస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి నిమ్మల మనోహర్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కొట్టేపాక రవి, నాయకులు పద్మా, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.