Wednesday, November 11, 2026
HomeEditorialటిఆర్పి బలోపేతం కోసం రంగం సిద్ధం

టిఆర్పి బలోపేతం కోసం రంగం సిద్ధం

📰 Generate e-Paper Clip

టీఆర్పీ భూపాలపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా మామిడి శ్రీకాంత్ నియామకం

భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా మామిడి శ్రీకాంత్‌ను నియమించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ చేసిన సూచన మేరకు ఈ నియామకం చేపట్టగా, తీన్మార్ మల్లన్న స్వయంగా మామిడి శ్రీకాంత్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

తన పుట్టినరోజు సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకం కావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో యువతను పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు నడిపించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆశయాలు, సిద్ధాంతాల కోసం యువత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.

అనంతరం నూతనంగా నియమితులైన మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్నకు, జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకువస్తానని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ క్రియాశీలకంగా పనిచేస్తానని శ్రీకాంత్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.