Monday, November 9, 2026
HomeEditorialఎల్కతుర్తికి నూతన కోర్టు మంజూరు.. సీఎం, మంత్రికి పాలాభిషేకం

ఎల్కతుర్తికి నూతన కోర్టు మంజూరు.. సీఎం, మంత్రికి పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటుతో పాటు, కోర్టు నిర్వహణకు 56 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మండల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ లీగల్ నాయకులు

 న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్ 

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గడ్డం విష్ణువర్ధన్ న్యాయవాది మరియు ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్కతుర్తిలో కోర్టు ఏర్పాటు మండల ప్రజల చిరకాల స్వప్నమని, 56 పోస్టులకు ఆమోదం లభించడం సంతోషకరమని, దీనివల్ల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయని అన్నారు. కోర్టు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, సొసైటీ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేన రెడ్డి, పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.