Monday, November 9, 2026
HomeEditorialరేవంత్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు

రేవంత్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

కొడంగల్‌లో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొడంగల్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు తరలివచ్చి ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కొడంగల్ నివాసం వద్ద సందడి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు వివిధ మాధ్యమాల ద్వారా కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారితో పాటు ఫోన్, సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అందించిన నాయకులు, ప్రముఖులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ చూపిన ఆప్యాయత, అభిమానం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.