Monday, November 9, 2026
HomeEditorialఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సొంతింటిలో దీపావళి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సొంతింటిలో దీపావళి

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సొంతింటిలో దీపావళి వేడుకలు జరుపుకున్న వొడితల ప్రణవ్…దీపాల వెలుగులవలె ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లు పారద్రోలి వెలుగులు నింపాలి.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల* కార్యక్రమం దీపాలు వెలిగిస్తూ,టపాకాయలు కాలుస్తూ,మిఠాయిలు పంచి పెట్టిన ఇంచార్జి ప్రణవ్..కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నెరవేరిన పేదవారి సొంతింటి కల.

ఇళ్లు లేని నిరుపేదలు ఆనాడు పూరి గుడిసెల్లో,కిరాయి ఇండ్లలో దీపావళి పండుగ జరుపుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతిల్లు కట్టుకోవాలనుకున్న వారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి,ఇప్పుడు సొంత ఇంటిలో దీపావళి పండుగను జరుపుకునేలా వారికి ఆర్థిక భరోసా కల్పించెలా కృషి చేశామని,ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని,సంతోషాన్ని కలిగించిందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.అనంతరం వారికి మిఠాయిలు పంచిపెట్టి,బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు.ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 2500 ఇళ్లు పూర్తి అయ్యాయని,ధర్మరాజుపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 110 ఇల్లులు మంజూరు అయితే మెజారిటీ స్థాయిలో 60 ఇళ్ళులకు పైగా పూర్తి అయ్యాయని,మిగతావి కూడా పూర్తి అయ్యే స్టేజ్ లో ఉన్నాయని అన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇళ్లు కేటాయించి ఆదుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,స్థానిక గ్రామ సర్పంచ్,మండల,పట్టణ అధ్యక్షుడు కిరణ్,తిరుపతి,మహిళా అధ్యక్షురాళ్ళు లావణ్య,స్వప్న,రాధ, కల్పన,స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు,సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.