Wednesday, November 11, 2026
Homeతెలంగాణపెన్ను పట్టిన, వీడియో కెమెరా పట్టిన వారందరూ జర్నలిస్టులే

పెన్ను పట్టిన, వీడియో కెమెరా పట్టిన వారందరూ జర్నలిస్టులే

📰 Generate e-Paper Clip

దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్..

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ    పెన్ను పట్టిన, వీడియో కెమెరా పట్టి తమ విధులు రోజువారీగా నిర్వహిస్తున్న వారందరూ జర్నలిస్టులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇకపై కావాలనే కక్షతో రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసే వారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై నిజాలను నిర్భయంగా వార్తల రూపంలో ప్రజలకు అందిస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టలేరని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు ఈ సమాచారం వెల్లడిస్తోంది.

శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు లేదా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారే కాకుండా, అక్రమ కేసుల నుంచి రక్షణ కోరే నిజాయితీ గల జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించాలనే అంశాన్ని ఈ సమాచారం ప్రస్తావిస్తోంది.

పరిష్కారం కోసం 7 రోజుల్లో నిర్ణయం తీసుకునే హక్కులు జర్నలిస్ట్ సంఘాలకే ఉంటాయని, వాళ్లను కాదని అక్రమ కేసులు పెట్టిన వారిపై అట్రాసిటీ తరహాలో చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపినట్లు ప్రచారంలో ఉన్న ఈ వార్త పేర్కొంటోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.