Wednesday, September 16, 2026
Homeతెలంగాణసొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: శీలంఅనిల్ కుమార్

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.                                           భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి 30 నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు శీలంఅనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కందుకూరి జ్యోతి -శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. లబ్ధిదారులు కందుకూరి జ్యోతి-శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సొంత ఇంటి కల కాంగ్రెస్ పార్టీతో నెరవేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ కు, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ గొడిశాల రాజయ్య, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సదానందం, శ్రీపతి బిక్షపతి, గొడిశాల వినయ్, నాగరాజు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.