Date of Publish : 30 August 2026, 6:43 pmPosted by : Reporter Srikanth
సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: శీలంఅనిల్ కుమార్
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి 30 నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు శీలంఅనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కందుకూరి జ్యోతి -శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. లబ్ధిదారులు కందుకూరి జ్యోతి-శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సొంత ఇంటి కల కాంగ్రెస్ పార్టీతో నెరవేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ కు, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ గొడిశాల రాజయ్య, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సదానందం, శ్రీపతి బిక్షపతి, గొడిశాల వినయ్, నాగరాజు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.