Friday, August 28, 2026
HomeEditorialజూపాక ఉన్నత పాఠశాల లో తాళ్లపల్లి శంకరయ్య స్మారక నగదు పురస్కారాలు. 

జూపాక ఉన్నత పాఠశాల లో తాళ్లపల్లి శంకరయ్య స్మారక నగదు పురస్కారాలు. 

📰 Generate e-Paper Clip

జూపాక ఉన్నత పాఠశాల లో తాళ్లపల్లి శంకరయ్య స్మారక నగదు పురస్కారాలు. 

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జూపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాళ్లపల్లి శంకరయ్య స్మారక నగదు పురస్కారాలను వారి కుమారులు తాళ్లపల్లి అమరేందర్, రాజేందర్ ,అశోక్ లు కలిసి గత 8 సంవత్సరాల నుండి పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు అందిస్తున్నారు. 80 వ స్వాతంత్ర దినోత్సవo సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పదవ తరగతిలో స్కూలు ప్రథమ స్థానం పొందిన ఇల్లందుల చరణ్ కు ( రూ 1016 ) , ద్వితీయ స్థానం పంజాల సాహిత్ కు ( రూ 516), తృతీయ స్థానం తాళ్లపల్లి ఋషిక కు ( రూ 516 ) మరియు జవహర్ నవోదయ లో సీటు సంపాదించిన పిండి హరిణి కి రూ 516 ప్రోత్సాహక బహుమతిని అందించారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి సోదరులను గ్రామస్తులు అభినందించారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి స్వప్న వెంకట స్వామి, ఉప సర్పంచ్ గిన్నా రపు మహేందర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ బానోతు పరశురాములు, ఏయంసి చైర్మన్ షహనాద్ సుల్తాన, పుర ప్రముఖులు కేతిరి రాజిరెడ్డి, రూపురెడ్డి మల్లారెడ్డి, గోలి శంకర్ లింగం, పంజాల రాజయ్య, సమ్మెట సదయ్యా , ఉపాధ్యాయులు తక్కెళ్ళపల్లి మాధవరావు, బీ, లక్ష్మి , పి. శ్రీనివాస్, బండ శ్రీనివాస్ , సర్వర్, జాన్ సునీల్, సబితా రెడ్డి ప్రసన్న లక్ష్మి వార్డు సభ్యులు చేపూరు రవళి, మారపల్లి లక్ష్మి, నిరంజన్ రెడ్డి, గురుకుంట్ల రాజు, లావణ్య , ఎంజాల రవళిక, చేపూరు రవి, కిరణ్ ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.