Friday, August 28, 2026
HomeEditorialహుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న టా ప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్  తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక సైదాపూర్ రోడ్డు లో గల మమతా వైన్డింగ్ వర్క్స్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించి నారు ఈ సందర్భంగా టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించడం పట్ల హుజురాబాద్ శాఖను అభినందించినారు దేశ స్వాతంత్రం కొరకు స్వాతంత్ర ఉద్యమంలో తమ ప్రాణాలను తృణంప్రాయంగా అర్పించిన ఆ దేశభక్తుల యొక్క త్యాగాలను ప్రతి భారతీయుడు అనునిత్యము స్మరిస్తూ వారి బాటలో నడచి ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగాలని అభిప్రాయపడి నారు అదేవిధంగా ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా పొందిన స్వాతంత్ర్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకొనుటలో ప్రతి భారతీయుడు ఒక సైనికునిగా ఆలోచించి దేశ రక్షణ కొరకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమనే విధంగా మెదిలి దేశ రక్షణలో అండగా ఉండాలని ఆకాంక్షించినారు కార్యక్రమంలో టా ప్ర హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య కోశాధికారి మండల వీరాస్వామి దాసరి మల్లేశం టాప్ర బాధ్యులు దొంత హరికిషన్ గౌరీశెట్టి సాంబయ్య ఉయ్యాల రాజేశం బొంగోని వెంకటయ్య మేకల మొగిలయ్య చొ ల్లేటి మల్లారెడ్డి చా డ సమిరెడ్డి శబ్ద ప్రకాష్ గాజర్ల బుచ్చిరాజం గూడూరి స్వామి రెడ్డి గాజే గంగయ్య ఫారెస్ట్ అధికారి రవీందర్ రెడ్డి తౌటం సంపత్ కుమార్ నల్ల రాజిరెడ్డి ముక్కెర మొగిలి గాజుల సత్యనారాయణ కొత్తగట్టు రవీందర్ రెడ్డి సురేష్ బాబు తదితరులు పాల్గొని విజయవంతం చేసి నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.