Tuesday, November 10, 2026
Homeతెలంగాణఎల్కతుర్తి చరిత్రలో కోర్టు ఏర్పాటుకు 56 పోస్టులు మంజూరు!

ఎల్కతుర్తి చరిత్రలో కోర్టు ఏర్పాటుకు 56 పోస్టులు మంజూరు!

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. కోర్టు ఏర్పాటుకు 56 పోస్టులు మంజూరు!మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో న్యాయస్థానం ఏర్పాటుకు కీలక ముందడుగు – అడ్వకేట్ గడ్డం విష్ణువర్ధన్ హర్షం

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఎల్కతుర్తిలో నూతనంగా కోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 56 పోస్టులను మంజూరు చేయడం పట్ల స్థానిక ప్రజలు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం కార్యరూపం దాల్చడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు, అడ్వకేట్ గడ్డం విష్ణువర్ధన్ పేర్కొన్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో 56 పోస్టుల మంజూరుకు ఆమోదం లభించడం ఎల్కతుర్తి ప్రాంతంలో న్యాయస్థానం ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందని తెలిపారు.

ఇప్పటివరకు న్యాయపరమైన అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న ప్రజలకు ఈ కోర్టు ఏర్పాటు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానికంగానే న్యాయ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడమే కాకుండా న్యాయ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.

ఎల్కతుర్తి అభివృద్ధిలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, భవిష్యత్తులో ప్రాంత ప్రగతికి ఇది మరింత దోహదపడుతుందని విష్ణువర్ధన్ అన్నారు.

ఈ సందర్భంగా కోర్టు ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అడ్వకేట్ గడ్డం విష్ణువర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్కతుర్తి ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల న్యాయవాదులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.