జమ్మికుంటలో ఘనంగా కాకతీయ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవం..రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట: పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం స్థానిక వ్యాపార రంగ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అన్నారు.
జమ్మికుంట పట్టణ పరిధిలోని 22వ వార్డులో కొడాలి రాజు నూతనంగా ఏర్పాటు చేసిన కాకతీయ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ రిబ్బన్ కట్ చేసి కాకతీయ ఎంటర్ప్రైజెస్ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంస్థ యజమాని కొడాలి రాజుకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతనంగా ప్రారంభించిన వ్యాపార సంస్థ భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో రాణిస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు పొందాలని, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
జమ్మికుంట పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం శుభపరిణామమని, స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు విస్తరించడం పట్టణ అభివృద్ధికి తోడ్పడుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.
నూతనంగా ప్రారంభించిన కాకతీయ ఎంటర్ప్రైజెస్ యజమాని కొడాలి రాజుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంద రాజేష్, రవీందర్ రావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

