Tuesday, October 20, 2026
Homeతెలంగాణహుజురాబాద్‌లో ఘనంగా విజయదశమి జమ్మి పూజలు

హుజురాబాద్‌లో ఘనంగా విజయదశమి జమ్మి పూజలు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ టౌన్ లో జమ్మి పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ మేకల స్వరూప తిరుపతి

హుజురాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని 1వ వార్డు కొత్తపల్లిలో నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ మేకల స్వరూప తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి పండుగ హుజురాబాద్ ప్రజలందరి జీవితాల్లో కొత్త ఆశలను, సంతోషాలను, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని కోరుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.