Tuesday, October 20, 2026
Homeతెలంగాణబోడుప్పల్, మేడిపల్లి డివిజన్లలో దసరా వేడుకలు.

బోడుప్పల్, మేడిపల్లి డివిజన్లలో దసరా వేడుకలు.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ బోడుప్పల్, మేడిపల్లి డివిజన్లలో దసరా వేడుకలు.. ముఖ్య అతిథిగా తోటకూర వజ్రేష్ యాదవ్

మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్, మేడిపల్లి డివిజన్లలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

బోడుప్పల్ డివిజన్‌లో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడిపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పండుగ విశిష్టతను గుర్తుచేసుకుంటూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ వేడుకలు ప్రజల్లో ఐక్యత, సోదరభావం, సాంస్కృతిక సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.