Tuesday, October 20, 2026
Homeతెలంగాణశమీ పూజలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

శమీ పూజలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

📰 Generate e-Paper Clip

గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో శమీ పూజలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని చారిత్రాత్మక, పురాతన గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.