Monday, October 19, 2026
Homeతెలంగాణఅంబేద్కర్ కూడలిలో అక్రమ కిరాణా షాపు డబ్బా!

అంబేద్కర్ కూడలిలో అక్రమ కిరాణా షాపు డబ్బా!

📰 Generate e-Paper Clip

పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువు.. అధికారుల తీరుపై ఆటో డ్రైవర్ల ఆవేదన!

బీమ్ ఇండియా టుడే న్యూస్: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కిరాణా షాపు డబ్బా ఆటో డ్రైవర్లకు ఇబ్బందిగా మారిందని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17 గ్రామాల ఆటో డ్రైవర్లు గత 30 సంవత్సరాలుగా ఆటోలను నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లకు అడ్డంగా కిరాణా షాపు డబ్బా ఏర్పాటు చేయడం వల్ల తమ ఉపాధికి ఆటంకం కలుగుతోందని వారు పేర్కొంటున్నారు.

ఆటో డ్రైవర్ల ఆరోపణల ప్రకారం, సంబంధిత నగర పంచాయతీ అనుమతులు లేకుండానే ఈ షాపు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని వారు వాపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ గారికి మూడు రోజుల క్రితం వినతి పత్రం అందించిన కూడా స్పందన లేదు

30 ఏళ్ల జీవనోపాధికి ఆటంకమా?

ఎన్నో సంవత్సరాలుగా ఆటోలను నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమకు అంబేద్కర్ కూడలి వద్ద ఎదురవుతున్న సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వినతిపత్రాలు ఇచ్చినా ఎందుకు స్పందించడం లేదు?

సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై ఆటో డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను అధికారులు ఇకనైనా పట్టించుకొని, కిరాణా షాపు డబ్బాకు సంబంధించిన అనుమతులను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని హుజురాబాద్ ఆటో యూనియన్ డ్రైవర్లుకోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.