Monday, October 19, 2026
Homeతెలంగాణబతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరిగినది.

బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరిగినది.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని, తేదీ: 14-10-2026 రోజున హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగినది.

ఇట్టి కార్యక్రమ వేడుకల్లో మహిళలు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరిగినది.

ఇట్టి కార్యక్రమము నందు పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి రోంటాల సుహాసిని గారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి వైభవానికి ప్రతీక. ఈ పండుగను సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో, ఐకమత్యంతో నిర్వహించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరినారు.

ఇట్టి కార్యక్రమంలో పురపాలక సంఘ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కో-ఆప్షన్ సభ్యులు మరియు మునిసిపల్ మేనేజర్ శ్రీ R. భూపాల్ రెడ్డి, మునిసిపల్ సిబ్బంది, మెప్మా TMC మల్లేశ్వరి  CLRP రమాదేవి, స్వరూప TLF RP అనూష మరియు OBలు RP లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.