Monday, October 19, 2026
Homeతెలంగాణతండ్రి ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడికి బెదిరింపులు

తండ్రి ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడికి బెదిరింపులు

📰 Generate e-Paper Clip

పంచారాయి భూమిలో అనధికారిక లేఅవుట్లు.. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల నిర్మాణం!

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితుడి ఆవేదన ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో ఘటన

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో 1978 లో ఎర్రోళ్ల దుర్గయ్య కు పంచారాయి ప్రభుత్వ భూమి వ్యవసాయ నిమిత్తం ఇవ్వడం జరిగింది దుర్గయ్య కు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఎర్రోళ్ల ఐలయ్య చిన్న కొడుకు ఎర్రోళ్ల పోచయ్య తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని అడిగిన తమ్ముడిని అన్న బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కుటుంబ ఆస్తిని అన్నదమ్ములిద్దరూ సమానంగా పంచుకోవాల్సి ఉండగా,అన్న ఒక్కడే ఆస్తిని అనుభవిస్తూ తమ్ముడికి రావాల్సిన వాటాను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి సంపాదించిన పంచరాయి భూమిలో మొత్తం 24 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని పలుమార్లు అన్నను కోరినప్పటికీ కొంతమంది వ్యక్తుల తో కలిసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. అంతేకాకుండా,వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం ప్లాట్లు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు కాజేశాడు అని ఆవేదన వ్యక్తం చేశాడు.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం!

తనకు న్యాయం చేయాలని బాధితుడు పలుమార్లు సంబంధిత అధికారులను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపాడు. చివరకు జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు.

బాధితుడికి న్యాయం చేయాలని విజ్ఞప్తి

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భూమి రికార్డులను పరిశీలించాలని, వివాదానికి సంబంధించిన వాస్తవాలను విచారించి చట్ట ప్రకారం తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. వివాదంలో ఉన్న భూమిపై చట్టవిరుద్ధమైన లావాదేవీలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.