ముదిరాజ్ సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి ముదిరాజ్ సంఘంలో జరిగిన ఎన్నికల్లో గంట శ్రీనాథ్ ముదిరాజ్ సంఘం డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, AMC డైరెక్టర్ పానుగంటి కిరణ్ రెడ్డి, బీసీ సెల్ అసెంబ్లీ చైర్మన్ కుర్ర శ్రీనివాస్ గౌడ్, జూపాక సమ్మక్క–సారలమ్మ చైర్మన్ దాసరి సదానందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉట్ల రత్నాకర్ రెడ్డి, గంట కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముదిరాజ్ సంఘం అభివృద్ధికి గంట శ్రీనాథ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. సంఘ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూ, సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం గంట శ్రీనాథ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

