కమలాపూర్‌లో “దివ్యాంగుల హక్కులు, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో “మీ సేవ” కార్యాలయం ఎదురుగా “జన చైతన్య స్ఫూర్తి” అనే స్వచ్ఛంద సంస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ శాఖ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసి గుర్తింపు పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.
సంస్థకు ప్రభుత్వ నిబంధనల మేరకు 12A, 80G, NITI Aayog, CSR-1, PAN, TAN, DIN, DSC తదితర ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు వెల్లడించారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత
జన చైతన్య స్ఫూర్తి” స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రధానంగా దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, అవగాహన కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలవడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సంస్థకు వ్యవస్థాపకులు, అధ్యక్షులుగా భీంపల్లి గ్రామానికి చెందిన బోయిని సంపత్ వ్యవహరిస్తున్నారు. కమలాపూర్ మండలంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సంస్థ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కమలాపూర్ మండల ప్రజలు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సంస్థ సేవలను వినియోగించుకోవాలని “జన చైతన్య స్ఫూర్తి” నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

