భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ జిల్లా కేంద్ర పరకాలలొ ఈరోజు పరకాల పట్టణంలో100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఓపీ సేవలను జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి గారితో కలిసి ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి
శనివారం పరకాల పట్టణంలో నూతనంగా నిర్మించి,అందుబాటులోకి తీసుకువచ్చిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ వైద్య సేవలను హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ప్రారంభించారు. అంతకముందు ప్రభుత్వ ఆసుపత్రి ముందు గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు స్వయంగా ఆసుపత్రిలో వైద్యులతో ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఓపీ సేవలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఫార్మసీ, జనరల్ వార్డు, గైనకాలజీ, ఏఎన్సీ, ల్యాబొరేటరీ తదితర విభాగాలను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…నిరుపేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని అన్నారు.ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పరకాల పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.పరకాలలో నూతనంగా నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ద్వారా పరకాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ప్రభుత్వ వైద్యం మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు. గౌ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు,జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజ నరసింహ గార్ల దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ బిల్లులను మంజూరు చేశామన్నారు.12 డిపార్ట్మెంట్ లో దాదాపు 27 మంది వైద్యులతో వైద్యసేవలు అందిస్తున్నారు.ఆసుపత్రిలో ఇంకా ఏవైనా వైద్య సదుపాయాలు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.వైద్యులు, సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సహకారంతో పరకాల ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి A+ కేటగిరీకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఆర్డీవో డీఎస్ వెంకన్న, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

