భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ మామునూరు ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రజలు పేర్లు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పిలుపునకు టాలీవుడ్ దర్శకులు స్పందించారు. వరంగల్ తన సొంతూరంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా **‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’**తో పాటు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’ పేర్లను సూచించారు. ఓరుగల్లు ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరు ఉండటం అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ‘దట్స్ ద స్పిరిట్’ అంటూ రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. ఈ మాట తన ‘స్పిరిట్’ సినిమాలోనూ ఉందని సందీప్‌రెడ్డి వంగా తిరిగి స్పందించారు. మరోవైపు ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పేరును సూచించగా.. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరంగల్’ పేరును ప్రతిపాదించారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టు పేరు అంశం చర్చనీయాంశంగా మారింది.

