BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 11:39 am Posted by : Reporter Srikanth

ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టే అంశం ఆసక్తికరంగా

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ మామునూరు ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రజలు పేర్లు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పిలుపునకు టాలీవుడ్‌ దర్శకులు స్పందించారు. వరంగల్‌ తన సొంతూరంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా **‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’**తో పాటు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’ పేర్లను సూచించారు. ఓరుగల్లు ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరు ఉండటం అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ‘దట్స్ ద స్పిరిట్’ అంటూ రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. ఈ మాట తన ‘స్పిరిట్’ సినిమాలోనూ ఉందని సందీప్‌రెడ్డి వంగా తిరిగి స్పందించారు. మరోవైపు ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ‘సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పేరును సూచించగా.. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరంగల్’ పేరును ప్రతిపాదించారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టు పేరు అంశం చర్చనీయాంశంగా మారింది.