బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలి మాన్యశ్రీ కాన్సీరామ్ వర్ధంతి సభ గోడపత్రికలు విడుదల బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జి మాసన్న జిల్లా అధ్యక్షులు మణి కుమార్
భీమ్ ఇండియా టుడే న్యూస్ జోగులాంబ ::(జిల్లా కేంద్రం )::- అక్టోబర్ 9న బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి మాసన్న, జిల్లా అధ్యక్షుడు మణికుమార్ కోరారు. ఈ మేరకు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంబంధిత గోడ పత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు పూర్తి చేసుకుని అడుగుపెట్టిన రాజ్యాంగ మమల్నికొచ్చి 76 ఏళ్లు దాటిన ఇంకా దేశంలో అంటరానితన వివక్ష కొనసాగుతూనే ఉన్నాయన్నారు. 85 నుండి 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల శ్రమతో దేశ సంపద పెరుగుతుంటే అగ్రకుల నాయకులు రాజకీయ అధికారాన్ని అనుభవిస్తూ బహుజనులను అణుగదొక్కుతున్నారని సందర్భంగా వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దాడులు పెరిగాయని.. కోదాడలో కర్ల రాజేష్ లాకప్ డెత్, షాద్నగర్లో ప్రేమ జంట సజీవ దహనం, మెదక్లో మాదిగ యువకుడి గ్రామ బహిష్కరణ, నేరెళ్లలో దళితులపై దాడులు మరియు తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లె గ్రామంలో దళితుల ఇంటిని కూల్చివేయడం అణచివేతకు సజీవ సాక్షాలని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద పెరిగిన పేద ప్రజలకు సొంత ఇండ్లు లేవన్నారు. ప్రభుత్వము అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని.. గురుకులాలలో పిల్లలకు నాణ్యమైన ఆహారం దక్కడం లేదని విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే దళితుడు సీఎం అని మాజీ సీఎం కేసీఆర్ మోసం చేస్తే.. ఇప్పుడు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మోసం గ్యారంటీగా పాలన సాగిస్తుందన్నారు. అగ్రకుల పార్టీల నుంచి గెలిచిన ఎస్సీ, ఎస్టీల ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు మౌనంగా ఉండడం మాన్యశ్రీ కాన్షీరామ్ గారు చెప్పిన చెంచా యుగానికి నిదర్శనం అన్నారు. రాజ్యాంగంలో హక్కులు ఉన్న పాలకులు అయ్యేది రాజకీయ పార్టీల ద్వారానే అన్న సత్యాన్ని మనం గ్రహించాలన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నాయి తప్ప పాలకవర్గంపై కాదని విషయాన్ని కూడా బహుజన సమాజం నమ్మాలన్నారు. బహుజన సమాజంపై దాడులు ఆగాలంటే బహుజనులే పాలకులు కావాలన్నారు. రాజాధికారంతోనే బహుజనలకు రక్షణ, అభివృద్ధి సాధ్యమని సందర్భంగా వారు అన్నారు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభకు బహుజన సమాజంతో పాటు అంబేద్కరైట్లు పెద్ద మొత్తంలో హాజరై విజయవంతం చేయాలన్నారు. గోడపత్రికలను విడుదల చేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్, జిల్లా కోశాధికారి శాంతిరాజు, ఈసీ సభ్యులు దుబ్బన్న, గద్వాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రామ్ పోగు నరేష్, ధర్మవరం రాముడు ఆకేపోగు నగేష్, దరెప్ప ఇతరులు పాల్గొన్నారు.

