Sunday, September 20, 2026
Homeతెలంగాణమహా గణనాధుని దర్శించుకున్న బీసీ జేఏసీ నాయకులు

మహా గణనాధుని దర్శించుకున్న బీసీ జేఏసీ నాయకులు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ వివేకానంద కాలనీ 21వ వార్డు గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.

బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, హుజురాబాద్ మండల బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ. 

హుజురాబాద్ పట్టణంలోని 21వ వార్డు వివేకానంద కాలనీలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినగణనాయకుని హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు దర్శించు కొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, మాట్లాడుతూ, గణేష్ యూత్ అసోసియేషన్ గణనాయకుని దర్శనానికి తమను ఆహ్వానించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, గణేష్ యూత్అసోసియేషన్ సభ్యులనుహృదయపూర్వకముగా అభినందించినారు. వినాయకుని అనుగ్రహంతో వివేకానంద కాలనీ వాసుల తో పాటు హుజురాబాద్ పట్టణ ప్రజలందరూఎలాంటి విఘ్నాలు లేకుండా అన్నింట విజయంతో ముందుకు సాగి సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా కలకాలం జీవించాలని ఆవినాయకుని మనస్ఫూర్తిగా కోరుకుం టున్నామని తెలియ జేసినారు. అదేవిధంగా ప్రజలందరూ భక్తి భావంతో అందరి ఆనందమే తమ ఆనందంగా భావించి అందరి కొరకు మనం మన కొరకు అందరు అనే విధంగామెదిలి ఆ వినాయకుని కృపా కటాక్ష మునకు పాత్రులు కావాలని ఆకాంక్షించినారు. ఇదే స్ఫూర్తితో గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలను ఇంతకన్నా ఘనంగా నిర్వహించి ఆ వినాయకుని ఆశీస్సులతో అందరి మెప్పు పొందాలని అసోసియేషన్ సభ్యులకు సూచించిననారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు మాము నూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, తిరునహరి రమేష్, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.