Thursday, November 12, 2026
HomeEditorialకరోనా కంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ పాలన ఉందంటూ విమర్శలు!

కరోనా కంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ పాలన ఉందంటూ విమర్శలు!

📰 Generate e-Paper Clip

తెలంగాణలో పారిశ్రామిక రంగం వెనుకబడుతోందని ప్రతిపక్షాల ఆరోపణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్:తెలంగాణ ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంలో వెనుకబడుతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

దావోస్ పర్యటనల పేరుతో భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు, వాస్తవ పెట్టుబడులపై స్పష్టత లేదని ఆరోపిస్తున్నారు. ఫేక్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వందల కోట్ల రూపాయలు ప్రచార కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారని మండిపడుతున్నారు.

పారిశ్రామిక రంగానికి కొత్త పెట్టుబడులు రావడం, ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా సమయంలో ఎదురైన పరిస్థితుల కంటే కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ ప్రతిపక్ష వర్గాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.