కరోనా కంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ పాలన ఉందంటూ విమర్శలు!
తెలంగాణలో పారిశ్రామిక రంగం వెనుకబడుతోందని ప్రతిపక్షాల ఆరోపణ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్:తెలంగాణ ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంలో వెనుకబడుతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దావోస్ పర్యటనల పేరుతో భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు, వాస్తవ పెట్టుబడులపై స్పష్టత లేదని ఆరోపిస్తున్నారు. ఫేక్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వందల కోట్ల రూపాయలు ప్రచార...