Thursday, November 12, 2026
HomeEditorialతెలంగాణ రాష్ట్రo గ్రీన్ సిటీ గా

తెలంగాణ రాష్ట్రo గ్రీన్ సిటీ గా

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వచ్ఛ నగరంగా గుర్తింపు పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు అభినందనలు తెలిపారు.

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ఈ జాతీయ గుర్తింపు లభించింది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం వంటి ప్రధాన అంశాల ప్రాతిపదికన GHMC ఈ పురస్కారానికి ఎంపికైంది.

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా, నెట్‌జీరో సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వివిధ ప్రమాణాల ఆధారంగా హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించడం నగరానికి, రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.

ఈ పురస్కారం సాధించడంలో GHMC అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వారి సమష్టి కృషికి లభించిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అభివర్ణించారు.

 హైదరాబాద్‌లో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, పట్టణ పరిశుభ్రతను పెంపొందించడం, పచ్చదనాన్ని విస్తరించడం ద్వారా నగరాన్ని పరిశుభ్రమైన, పర్యావరణహితమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.