పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తు నిర్మాణానికి ముందుకు వచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏకుల రఘుపతి
సంఘం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళికి విరాళం అందజేత.. అభినందించిన కార్యవర్గ సభ్యులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లా( దేవరకొండ) , నవంబర్ 6:దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తూ నిర్మాణ నిధికి ఏకుల రఘుపతి రిటైర్డ్ ప్రిన్సిపాల్ రూ. 20,000 ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళికి అందజేసినారు. ఈ సందర్బంగా రఘుపతి మాట్లాడుతూ మా పెన్షనర్స్ సంఘం దేవరకొండ కార్యవర్గం సేవలను వెలకట్టలేనివి అన్నారు. ఆర్థికముగా మేము చేసిన సహాయం వారి సేవలకంటే ఎక్కువకాడు అన్నారు. ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి మాట్లాడుతూ మా సంఘం సభ్యుల ఆర్థిక సహాయం మరువలేము అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి, సహ అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఇజాక్, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్,కార్యవర్గం సభ్యులు ముసిని వీరయ్య, మోటమర్రి పురుషోత్తం,జంపాల యాదగిరి, అలంపల్లి శ్రీనివాసులు, సభ్యులు పాలుగోని దాతకు ధన్యవాదములు తెలియజేసినారు.

